Personal Loan Without CIBIL Score l Personal Loan
పర్సనల్ లోన్ తరచూ చాలా మందికి అవసరం అవుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఆర్ధిక అవసరాలకు దిగువ, మధ్యతరగతి వారికి కొంత డబ్బు అవసరం అయినపుడు వారికి ఉండే మార్గం లోన్ తీసుకోవడమే. అయితే ఒకప్పటి మాదిరిగా కాకుండా నేడు గవర్నమెంట్ తీసుకువచ్చిన Cibil Score విధానం వలన తగినంత స్కోర్ లేకపోతే చాలావరకు బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు సైతం లోన్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.
మరి పలువురికి అవసరం అయిన మెడికల్ బిల్స్, హాస్పిటల్ ఖర్చులు, ఎమర్జెన్సీ కి సంబంధించి ఖర్చుల కోసం డబ్బులు కావలి అంటే సిబిల్ స్కోర్ లేకపోతే అది కుదరదు, మరి సిబిల్ లేకుండా మనం Personal Loan పొందే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి నేడు ఈ ఆర్టికల్ లో పూర్తి వివరాలు చూద్దాం.
సింపుల్ ఆన్సర్ చెప్పాలి అంటే అది చాలా కొద్దీ సందర్భాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. అయితే దానికి సంబందించిన విధానం అర్ధం చేసుకుంటే లోన్ మనం పొందవచ్చు.
అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి ?
సిబిల్ స్కోర్ అనేది ఒక క్రెడిట్ స్కోర్, ఇద్రి అందరికీ 300 నుండి 900 మధ్యన ఉంటుంది
750+ ఉంటే అది ఎక్సలెంట్
65-750 ఉంటే గుడ్
550-650 ఉంటే యావరేజ్
550 లోపు ఉంటే అది రిస్క్
వాస్తవానికి బ్యాంక్స్ & నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఈ స్కోర్ ని చూసి అప్పు తీసుకునే వ్యక్తి యొక్క రిస్క్ ని అంచనా వేస్తారు
కానీ సిబిల్ స్కోర్ లేకపోయినా లేదా తక్కువ ఉన్న కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి
అసలు సిబిల్ స్కోర్ లేకుండా లోన్ ఎవరికి దొరుకుతుంది ?
మొదట లోన్ తీసుకునే వారికి :
ఎవరు ఇప్పటివరకు ఒక్కసారి కూడా లోన్ తీసుకోకపోతే వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది ఉండదు కాబట్టి అలాంటివారికి కొన్ని ఫైనాన్స్ సంస్థలు లేదా బ్యాంకులు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి.
సెల్ఫ్ ఎంప్లాయాయ్ పర్సన్స్ :
చిన్న వ్యాపార సంస్థలు నిర్వహించే వారు, ఫ్రీలాన్స్ వర్క్ చేసేవారు, ఇటువంటి వారికి ఆదాయ ప్రూఫ్ ఉంటే కొన్ని సంస్థలు లోన్ ఇవ్వడానికి సుముఖంగా ఉంటాయి.
తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నపుడు :
సిబిల్ స్కోర్ ఉంది కానీ తక్కువ ట్రాన్సక్షన్స్ ఉంటే అటువంటి వారికి కొంత ఆలోచన చేసి లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
సిబిల్ స్కోర్ లేకుండా లోన్ ఇచ్చే సంస్థలు (అప్షన్స్)
NBFC Companies
ఇవి బ్యాంక్స్ కంటే కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి
ముఖ్యంగా డాక్యుమెంటేషన్ తక్కువ ఉంటుంది
ఫాస్ట్ గా లోన్ ఇచేలా చూస్తారు
అలానే ముఖ్యంగా సిబిల్ ఉండాలి అనే నిబంధన కొంత తక్కువ ఉంటుంది.
పట్టిక 1 : CIBIL లేకుండా Personal Loan పొందే మార్గాల పోలిక
| రుణ ఎంపిక | CIBIL అవసరం | వడ్డీ రేటు | ఋణం లభించే వేగం | రిస్క్ స్థాయి |
| Bank Personal Loan | ఎక్కువగా అవసరం | తక్కువ | మధ్యస్థం | తక్కువ |
| NBFC Personal Loan | కొంత సడలింపు | మధ్యస్థం | వేగంగా | మధ్యస్థం |
| Digital Loan Apps | కొన్ని సందర్భాల్లో అవసరం ఉండకపోవచ్చు | ఎక్కువ | చాలా వేగంగా | ఎక్కువ |
| Gold Loan | సాధారణంగా అవసరం లేదు | తక్కువ | చాలా వేగంగా | తక్కువ |
| Salary Based Loan | ఆదాయం పై ఆధారితం | మధ్యస్థం | వేగంగా | మధ్యస్థం |
Digital Loan Apps
భారత ప్రభుత్వం చేత ఆమోదింపబడిన ఆన్లైన్ ద్వారా లోన్ ఇచ్చే ఇన్స్టంట్ యాప్స్ కొన్ని మాత్రమే ఉంటాయి, అవి అయితే సిబిల్ పెద్దగా పట్టించుకోవు.
కానీ ఇటువంటి వాటి విషయంలో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వీటిలో వడ్డీ రేట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
Gold Loan
మీ వద్ద బంగారం ఉంటే సిబిల్ అవసరం ఉండదు
అలానే లోన్ కూడా ఆ బంగారు నగల పై ఇట్టే వస్తుంది
ముఖ్యంగా ఇది అన్నిటికంటే ఒక పెద్ద సేఫ్ ఆపాశం అని చెప్పాలి
Salary Based Loan
మీకు కనుక కొన్ని నెలల నుండి కరెక్ట్ గా ఒక సరైన మొత్తంలో శాలరీ వస్తుంటే కొన్ని సంస్థలు మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది.

Required Documents Without CIBIL :
ఆధార్ కార్డు
పాన్ కార్డు
బ్యాంకు స్టేట్మెంట్ 6 నెలలు
శాలరీ స్లిప్ / ఆదాయ ప్రూఫ్
ముఖ్యంగా వీటిలో ఆదాయ ప్రూఫ్ అనేది చాలా అవసరం
Ineterst Rates :
సిబిల్ లేకుండా లోన్ తీసుకుంటే ముఖ్యంగా వడ్డీ రేటు అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది.
14-36% వరకు ఉండే అవకాశం కూడా ఉంది
కారణం – రిస్క్ ఎక్కువ కాబట్టి ఆయా సంస్థలు ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు
Risks and Disadvantages:
సిబిల్ లేకుండా లోన్ తీసుకుంటే
ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది
లోన్ అమౌట్ కూడా తక్కువ వచ్చే ఛాన్స్
తిరిగి కట్టే రూల్స్ ఎక్కువగా ఉంటాయి
ముఖ్యంగా ఒకవేళ ఒక EMI మిస్ అయినా పెనాల్టీ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది.
Tips to Increase Your Loan Approval :
- ఆదాయం అనేది ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా వచ్చేలా చూసుకోవాలి
ప్రతి నెలా మనకు శాలరీ వస్తే కొంతవరకు అది చూపించవచ్చు
- బ్యాంకు బ్యాలెన్స్ మైంటైన్ చేయడం
ఎప్పటికప్పుడు మీ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ మైంటైన్ చేస్తే లోన్ ఇచ్చేవారికి మీ మీద కొంత నమ్మకం ఏర్పడుతుంది
- ఆల్రెడీ తీసుకున్న లోన్స్ ఉంటే కట్టేయండి
మీకు ఇప్పటికే లోన్స్ కనుక ఉండి కొత్తగా లోన్ తీసుకోవాలి అంటే అది ఆమోదం పొందే ఛాన్స్ తక్కువ
- కో అప్లికెంట్ ని యాడ్ చేయండి
మీకు మంచి సిబిల్ స్కోర్ ఉన్న పెర్సన్ జత కలిస్తే మీకు లోన్ లభించే ఛాన్స్ లు ఎక్కువ ఉంటాయి.

Best Alternatives (Without CIBIL)
మీ స్నేహితులు లేదా బంధువుల నుండి అప్పు తీసుకునేందుకు ప్రయత్నించండి
మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉంటే EMI ద్వారా లోన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది
చిన్న మొత్తంలో గోల్డ్ లోన్, అది ఎంతో కొంత అయినా మీ ఆర్ధిక సమస్య తీరుస్తుంది.
అయితే సిబిల్ స్కోర్ తో లోన్ తీసుకోవాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకొవాల్సిన విషయాలు :
బ్యాంకుల్లో అయితే లోన్ వచ్చే ఛాన్స్ తక్కువ, NBFC వారి నుండి కొద్దిగా ఛాన్స్, అదే యాప్స్ లో అయితే త్వరగా లభించే ఛాన్స్ ఉంటుంది.
కానీ వడ్డీ విషయం చూసుకుంటే, బ్యాంకుల్లో తక్కువ NBFC సంస్థల్లో మీడియంగా అలానే లోన్ యాప్స్ లో ఎక్కువ ఉంటుంది .
రిస్క్ కూడా బ్యాంకులు, NBFC సంస్థల పై పోలిస్తే లోన్ యాప్స్ లో అది అధికం, అందుకే ఒకటికి పదిసార్లు అలోచించి పలువురిని సంప్రదించి యాప్స్ లో లోన్ తీసుకోండి.
సిబిల్ తో లోన్ తీసుకునే సమయంలో చేయకూడని పొరపాట్లు :
ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వకండి
తెలియని, అవగాహనా లేని యాప్స్ నుండి ఏమాత్రం లోన్ తీసుకోకండి
ప్రతి సంస్థ, అలానే యాప్ యొక్క Terms & Conditions తప్పకుండా చదవండి.
పట్టిక 2 : Loan Approval పెంచే ఉత్తమ మార్గాలు
| చేయాల్సిన పని | ప్రయోజనం |
| స్థిరమైన ఆదాయం చూపించడం | రుణ అర్హత పెరుగుతుంది |
| బ్యాంకు స్టేట్మెంట్ బాగుండడం | నమ్మకం పెరుగుతుంది |
| పాత రుణాలను క్లియర్ చేయడం | క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడుతుంది |
| కో అప్లికెంట్ చేర్చడం | ఋణం ఆమోదం పొందే అవకాశం పెరుగుతుంది |
| సరైన KYC పత్రాలు సమర్పించడం | ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది |
| అవటానికి తగ్గ ఋణం మాత్రమే తీసుకోవడం | EMI భారం తగ్గుతుంది |
ముగింపు (CIBILScore Conclusion) :
మీరు పెద్ద మొత్తంలో ఎప్పుడైనా లోన్ తీసుకోవాలి అంటే చాలా రోజుల పాటు మీ సిబిల్ ని తక్కువ కాకుండా చూసుకోవాలి, మీరు గతంలో లోన్స్, EMI లు ఉంటె అవి ఏ మాత్రం మిస్ చేయకుండా ఎప్పటికప్పుడు కడుతూ ఉండండి. మీ ఇంటి అవసరాల కంటే ముందు పాత లోన్స్ క్లియర్ చేస్తే మీకు భవిష్యత్తులో తప్పకుండా పెద్ద మొత్తంలో అయినా లోన్ లభించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా నేడు సిబిల్ స్కోర్ అనేది మన ఆర్ధిక అవసరాల్లో ప్రధాన భూమిక పోషిస్తోంది.
అలానే వడ్డీ ఎక్కువగా ఉన్నా పర్లేదు అని ఏ యాప్ ని పడితే ఆ యాప్ ని నమ్మి లోన్ తీసుకోకండి, ముఖ్యంగా సిబిల్ బాగా మెయింటెయిన్ చేస్తే చక్కగా బ్యాంక్స్ లేదా NBFC సంస్థలు మీకు లోన్ అందిస్తాయి. వీలైతే చిన్నమొత్తంలో బంగారం ఉంటె కొద్దిపాటి లోన్స్ తీసుకుని తాత్కాలిక అవసరాలు తీర్చుకోండి. అందుకే అందరం ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్ తగ్గకుండా గట్టిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే మన అత్యవసర సమయంలో లోన్ కోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదని పలువురు ఆర్ధిక నిపుణులు వెల్లడిస్తున్నారు
Frequently Asked Questions (People Also Ask)
- CIBIL లేకుండా లోన్ ఫాస్ట్ గా దొరుకుతుందా ?
అవును కానీ ఎక్కువగా NBFC సంస్థలు, యాప్స్ ద్వారా దొరుకుంటుంది
- మినిమమ్ శాలరీ ఎంత ఉండాలి ?
సాధారణంగా 10,000 నుండి 25,000 మధ్యన ఉండాలి
- సేఫ్ ఆప్షన్ ఏంటి ?
గోల్డ్ లోన్ అన్నిటికంటే సేఫ్
50,000 Loan Without CIBIL Score
ప్రశ్న : CIBIL స్కోర్ లేకుండా 50,000 వ్యక్తిగత ఋణం పొందవచ్చా ?
సమాధానం : కొన్ని NBFC లు మరియు డిజిటల్ లెండర్లు ఆదాయం, బ్యాంక్ ట్రాన్సక్షన్లు, రీ పేమెంట్ సామర్ధ్యాన్ని పరిశీలించి 50,000 వరకు రుణాలను అందించే అవకాశం ఉంటుంది.
Urgent Loan Without CIBIL Score
ప్రశ్న : CIBIL స్కోర్ లేకుండా అత్యవసర ఋణం పొందడం సాధ్యమేనా ?
సమాధానం : అవును, కొందరు రుణదాతలు సంప్రదాయ క్రెడిట్ స్కోర్ కంటే ఆదాయం మరియు KYC పత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి అత్యవసర రుణాలను అందిస్తారు.
Urgent Loan with Bad Credit in India
ప్రశ్న : చెడు క్రెడిట్ హిస్టరీ ఉన్నవారికి అత్యవసర ఋణం లభిస్తుందా ?
సమాధానం : తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా కొన్ని సంస్థలు రుణాలు మంజూరు చేయవచ్చు.
ఐతే వడ్డీ రేట్లు మరియు నిబంధనలు సాధారణ రుణాలతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు.
Urgent Loan Without CIBIL in India
ప్రశ్న : భారతదేశంలో CIBIL చెక్ లేకుండా ఋణం తీసుకునే ముందు ఏమి తెలుసుకోవాలి ?
సమాధానం : రుణదాత విశ్వసనీయత, వడ్డీ రేటు, ప్రోసెసింగ్ ఫీజు, రీపేమెంట్ షరతులను పూర్తిగా పరిశీలించిన తరువాత మాత్రమే దరఖాస్తు చేయడం మంచిది.
Urgent Loan Without CIBIL and Income Proof
ప్రశ్న : ఆదాయ రుజువు, CIBIL స్కోర్ లేకుండా ఋణం పొందవచ్చా ?
సమాధానం : కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పత్రాలు లేదా బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఋణం లభించే అవకాశం ఉంటుంది. అయితే ఇది రుణదాత విధానాల పై ఆధారపడి ఉంటుంది.
500 CIBIL Loan App
ప్రశ్న : 500 CIBIL స్కోర్ ఉన్నవారికి లోన్ యాప్ ల ద్వారా ఋణం దొరుకుతుందా ?
సమాధానం : కొంతమంది డిజిటల్ రుణదాతలు తక్కువ CIBIL స్కోర్ ఉన్నవారికి కూడా రుణ అవకాశాలు కల్పిస్తారు. అయితే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
5000 Loan Without CIBIL Score
ప్రశ్న : CIBIL స్కోర్ లేకుండా 5000 చిన్న ఋణం పొందడం సులభమేనా ?
సమాధానం : చిన్న మొత్తాల రుణాల విషయంలో కొన్ని యాప్ లు మరియు NBFC సులభమైన అర్హత ప్రమాణాలను అనుసరించవచ్చు. అయినప్పటికీ KYC ధ్రువీకరణ సాధనంగా అవసరం అవుతుంది.
Low CIBIL Score Personal Loan 10000
ప్రశ్న : తక్కువ CIBIL స్కోర్ తో 10000 పర్సనల్ లోన్ పొందే అవకాశాలు ఉన్నాయా ?
సమాధానం : అవును, ఆదాయం మరియు బ్యాంకు ఖాతా చరిత్ర సంతృప్తికరంగా ఉంటే కొన్ని రుణదాతలు చిన్న మొత్తాల వ్యక్తిగత రుణాలను అందించవచ్చు.
అదనపు Frequently Asked Questions
1. CIBIL స్కోర్ లేకుండా Personal Loan పొందడం నిజంగా సాధ్యమేనా?
అవును, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో CIBIL స్కోర్ లేకుండానే వ్యక్తిగత ఋణం పొందే అవకాశం ఉంటుందా. ముఖ్యంగా మొదటిసారి లోన్ తీసుకునే వారు, స్థిరమైన ఆదాయం వున్నా ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు లేదా ప్రత్యామ్నాయ ఆదాయ రుజువులు చూపగలిగే వారు కొన్ని NBFC మరియు డిజిటల్ రుణదాతల ద్వారా రుణానికి అర్హులు కావచ్చు. అయితే వడ్డీ రేట్లు మరియు రుణ నిబంధనలు సాధారణ బ్యాంకు రుణాలతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు.
2. CIBIL స్కోర్ లేకుండా లోన్ ఇవ్వాడానికి రుణదాతలు ఏ అంశాలను పరిశీలిస్తారు?
రుణదాతలు కేవలం CIBIL స్కోర్ పైనే ఆధారపడరు. నెలవారీ ఆదాయం, బ్యాంకు ఖాతా లావాదేవీలు, ఉద్యోగ స్థిరత్వం, KYC పత్రాలు, నివాస వివరాలు మరియు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని కూడా పరిశీలిస్తారు. కొన్ని సందర్భాల్లో కో-అప్లికెంట్ లేదా గ్యారంటీ కూడా ఉపయోగపడుతుంది.
3. CIBIL లేకుండా Personal Loan తీసుకోవడం వాళ్ళ ప్రధాన నష్టాలు ఏమిటి?
ఇలాంటి రుణాల్లో సాధారణంగా వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అలాగే రుణ మొత్తం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా EMI చెల్లిస్తే అధిక పెనాల్టీలు విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల రుణ ఒప్పందాన్ని పూర్తిగా చదివిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది.
4. Gold Loan మరియు Personal Loan లో CIBIL పరంగా ఏది సులభం?
మీ వద్ద బంగారం ఉంటే Gold Loan సాధారణంగా సులభంగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఆస్థి ఆధారిత రుణం. Personal Loan మాత్రం ఎక్కువగా ఆదాయం, క్రెడిట్ ప్రొఫైల్ మరియు రేపేమెంట్ సామర్ధ్యం పై ఆధారపడి ఉంటుంది.
5. మొదటిసారి లోన్ తీసుకునే వారికి CIBIL స్కోర్ ఉండకపోతే ఏం చేయాలి?
మొదటి చిన్న మొత్తంలో రుణం తీసుకుని సమయానికి తిరిగి చెల్లించడం ద్వారా మంచి క్రెడిట్ చరిత్రను నిర్మించుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డు బిల్లులు మరియు EMIలను ఎప్పటికప్పుడు చెల్లించడం వల్ల భవిష్యత్తులో CIBIL స్కోర్ మెరుగుపడే అవకాశం ఉంటుంది.
6. Online Loan Apps ద్వారా ఋణము తీసుకునే ముందు ఏమి పరిశీలించాలి?
రిజిస్ట్రేషన్ వివరాలు, వడ్డీ రేటు, Processing Fee, దాచిన చార్జీలు, Privacy Policy, Terms & Conditions మరియు కస్టమర్ సపోర్ట్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అధికారికంగా పనిచేసే సంస్థల నుంచే రుణం తీసుకోవడం సురక్షితం.
7. Salary Proof లేకుండా Personal Loan పొందవచ్చా?
కొన్ని సందర్భాల్లో బ్యాంక్ స్టేట్మెంట్, వ్యాపార ఆదాయ రికార్డులు లేదా ఇతర ఆదాయ రుజువుల ఆధారంగా రుణం లభించే అవకాశం ఉంటుందా. అయితే ఇది ప్రతి రుణదాత యొక్క విధానంపై ఆధారపడి ఉంటుంది.
8. NBFC మరియు బ్యాంక్ Personal Loan మధ్య ప్రధాన తేడా ఏమిటి?
బ్యాంకులు సాధారణంగా తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తాయి కానీ అర్హత ప్రమాణాలు కఠినంగా ఉంటాయి. NBFCలు కొంత సౌకర్యవంతంగా వ్యవహరించినప్పటికీ వడ్డీ రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
9. CIBIL స్కోర్ మెరుగుపడేందుకు ఎంత సమయం పడుతుంది?
ఇది వ్యక్తిగత రేపేమెంట్ చరిత్రపై ఆదాహారపడి ఉంటుంది. EMIలు, CREDIT కార్డు బిల్లులు సమయానికి చెల్లించడం మరియు అధిక రుణ భారం తగ్గించడం ద్వారా కొన్ని నెలల్లో క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడే అవకాశం ఉంటుంది.
10. అత్యవసర పరిస్థితుల్లో Personal Loan తీసుకునే ముందు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?
రుణ మొత్తం నిజంగా అవసరమా, వడ్డీ రేటు ఎంత, నెలవారీ EMI మీ ఆదాయానికి సరిపోతుందా, ప్రాసెసింగ్ ఫీజులు ఎంత, ముందస్తు చెల్లింపులపై చార్జీలు ఉన్నాయా అనే అంశాలను ముందుగానే పరిశీలించడం మంచిది. అవసరానికి మించి రుణం తీసుకోవడం భవిష్యత్తులో ఆర్ధిక ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంటుంది.
Sources & References:-
- Consumer Financial Protection Bureau (CFPB) – Personal Loans Guide
- Federal Trade Commission (FTC) – Consumer Credit Information
- USA Gov – Credit and Loans Information
- Experian – Credit Score Education
- Equifax – Personal Credit Resources
- TransUnion – Credit Learning Center
- FICO – Credit Score Information
- Investopedia – Personal Loan Guide
- NerdWallet – Personal Loan Resources
- Consumer Financial Protection Bureau – Borrowing Money Resources
Article was Last Updated on 29th June 2026.
For More Updates Please Follow Click Here

